కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే
16-03-2026 01:33 AM
ములకలపల్లి, మార్చి 15 (విజయక్రాంతి): అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం పంచా యతీ కార్మికుల కాళ్లను కడిగి సత్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారకు. దుస్తులను అందించడంతోపాటు స్వయంగా తన చేతులతో కార్మికుల కాళ్లను కడిగి, సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తున్న కార్మికుల సేవలను గౌరవించి కాళ్లు కడగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బత్తుల అంజి, కారం సుధీర్ పాల్గొన్నారు.




