26 August, 2026 | 6:34 PM

బీదల గుండెల్లో నిలిచిన గార్డెన్ దొర

26-08-2026 05:46 PM

జహీరాబాద్. ఆగస్టు 26 ( విజయ క్రాంతి): జార్జ్. బి. గార్డెన్ దొర బీద ప్రజల గుండెల్లో ఎల్లకాలం నిలిచి ఉండే మహోన్నతమైన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం అన్నారు. బుధవారం నాడు జహీరాబాద్ లోని గార్డెన్ నగర్ లో జార్జ్. బి. గార్డెన్ దొర 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరోత్తం మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతం విద్యలో అభివృద్ధి చెందడానికి జార్జ్ బి గార్డెన్ దొర ఎంతగానో కృషి చేశారని అన్నారు.

జహీరాబాద్ ప్రాంతంలో అణిచివేతకు గురి అయిన ఎస్సీ, సమాజానికి విద్యను ధారపోసిన మహోన్నతమైన వ్యక్తి గార్డెన్ దొర అని తెలిపారు. జహీరాబాద్ లోని అల్లీపూర్ సమీపంలో స్వాతంత్ర అనంతరం ఇక్కడి ప్రజలకు విద్యకు దూరంగా ఉన్న సమయంలో దేవుడు దిగి వచ్చినట్లు గార్డెన్ దొర పాఠశాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యతోపాటు భోజన సదుపాయాలను కల్పించిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు.

సుదూర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ ఏర్పాటు చేసి అందులో హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పించి మారుమూల గ్రామాల బీద బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్య అందించడం వల్ల చాలామంది విద్య నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన పేర్కొన్నారు గార్డెన్ దొర ఆశయాలకు అనుగుణంగా మనమందరము నడుచుకొని ఆయనకు నివాళులర్పించవలమ్మ అవుతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం వై సభ్యులు టి వినయ్ కుమార్ ,దేవిదాస్ ,మోహన్ ,సత్యానంద్ ,కౌన్సిలర్ దీపక్ అప్పి ,లవన్, స్వామి దాస్ ,శంకర్ , ప్రవీణ్ ,చింటూ, మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.