శివుడికి ఘనంగా రుద్రాభిషేకం
26-08-2026 06:25 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో బుధవారం ప్రముఖ రైస్ మిల్ ల వ్యాపారవేత్త కొమురవెల్లి రామ్మూర్తి సత్తమ్మ, దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం చేశారు, రామ్మూర్తి పుట్టినరోజును పురస్కరించుకొని విశేషంగా రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు వల్లకొండ మఠం రమేష్ స్వామి వారి శేష వస్త్రం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు, అలాగే వాసవి మాత దేవాలయంలో ను ప్రత్యేక పూజలు అనంతరం అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ కొమురవెల్లి రామ్మూర్తి పుట్టినరోజు పురస్కరించుకొని అమ్మవారి శేష వస్త్రం అందజేశారు, ఈ కార్యక్రమంలో శివాలయ భక్త బృందం పాల్గొన్నారు...






