26 August, 2026 | 6:59 PM

మధుమేహంతో కిడ్నీల మీద ప్రభావం

26-08-2026 06:20 PM

ముందస్తు గుర్తింపుతోనే నివారణ సాధ్యం

తప్పని పరిస్థితుల్లోనే కిడ్నీ మార్పిడి

యశోద నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రణిత్ రాం

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : ఉరుకుల, పరుగుల కాలంలో ప్రజలు మధుమేహంపై దృష్టి సారించకపోవడంతో వారికి తెలియకుండానే దాని ప్రభావం కిడ్నీలపై పడుతుందని యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ ఫ్లాంటేషన్ వైద్యులు ప్రణిత్ రాం సూచించారు. బుధవారం విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఇంఛార్జి మేనేజర్ అంకం మల్లేష్ తో కలిసి ఆయన మాట్లాడారు.

మధుమేహం కిడ్నీల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అప్రమత్తంగా ఉండాలని, అందు కోసం కిడ్నీల పనితీరులో మార్పులను సూచించే కాళ్ల వాపు, కండ్లు మసకబారడం, శరీరంలో మార్పులు, రాత్రి వేళల్లో అసాధారణంగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ట్యాబ్లెట్లతో సమస్య నయం కాకపోతే, తప్పని సరి పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని, పేద, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఈ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు మధుమేహంపై నిర్లక్ష్యం చేయవద్దని, వైద్యులను సంప్రదించాలన్నారు.