26 August, 2026 | 8:38 PM

మిలాద్ ఉన్ నబీ సందర్బంగా అన్నదాన కార్యక్రమం

26-08-2026 06:26 PM

ముకరంపుర, ఆగస్టు 26(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని భగత్ నగర్, గోదాంగడ్డ ప్రాంతాలలో మిలాద్ ఉన్ నబీ పండగ వేడుకలు జైబూన్ యూత్ క్లబ్ మరియు ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన  అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైబూన్ యూత్ క్లబ్ సభ్యులు హమీద్, అబ్దుల్ సువాన్, తాహెర్, అయాన్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.