15 April, 2026 | 3:56 AM

ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్

15-04-2026 01:24 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త  

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135జయంతి సందర్భంగా ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహోన్నత ఆశయాలతో, సమానత్వమే ఊపిరిగా రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అన్నారు. కార్యక్రమంలో ఎడల రమేష్. జీడి నరసింహ మాదిగ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్. గిరిజన మహాశక్తి రాష్ట్ర అధ్యక్షులు. చందర్ నాయక్. రవి నాయక్ పాల్గొన్నారు.