15 April, 2026 | 3:57 AM

వరుసగా మూడోసారి ఇంటర్ బోర్డ్ చరిత్రలోనే..

15-04-2026 01:23 AM

అత్యుత్తమ మార్కులతో నారాయణ ఆల్‌టైమ్ రికార్డ్!

హైదరాబాద్, ఏప్రిల్ 1౪(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఇంట ర్‌ఠూ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 469,469 మార్కులతో రెండు స్టేట్ ఫస్ట్ మార్కు సాధించి విజయదుందుభి మోగించారు. అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 996 మార్కులను ఐదుగురు నారాయణ విద్యార్థులు సాధించారు.

అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులను 14 విద్యార్థులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలోనూ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులను ముగ్గురు(3) నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఫలితాలను గ్రూపుల వారీగా విశ్లేషిస్తే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఇంటర్ బోర్డు చరిత్రలోనే అత్యధికంగా 470 మార్కులకు గాను 469 మార్కులతో నారాయణ విద్యార్థులు కె.సాయిగౌతమ్(హెచ్‌టీ నెం 2643109430),జి.వరేణ్య(హెచ్‌టీ నెం.2645105059) చరిత్ర సృష్టించారు.

468 మార్కులు 183 మంది, 467 మార్కులు 470 మంది, 466 మార్కులు 667 మంది, 465 మార్కులు 694 మంది విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 996 వంటి అత్యుత్తమైన మార్కులను 5గురు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అలాగే 995 మార్కులను 10 మంది, 994 మార్కులను 29 మంది, 993 మార్కులను 71 మంది, 992 మార్కులను ౧౨౧ మంది సాధించారు.

అదేవిధంగా జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులను మొత్తం 14మంది విద్యార్థులు కైవసం చేసుకోగా 437 మార్కులను 49 మంది,436 మార్కులను 68 మంది, 435 మార్కులను 67 మంది నారాయణ విద్యార్థులు సాధించారు.

సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 994 మార్కులు ముగ్గురు(3) సాధించగా, 993 మార్కులు ముగ్గురు(3), 992 మార్కులు 11 మంది,991 మార్కులు11 మంది,990 మార్కులు ఏడుగురు(౭) సాధించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి.సింధూర నారాయణ, శరణి నారాయణ, రమా నారాయణ తెలిపారు. ఈ స్థాయి ఫలితాలు నారాయణ తప్ప మరి ఏ ఇతర సంస్థ సాధించలేదని పేర్కొన్నారు. రమా నారాయణ మాట్లాడుతూ 

జూనియర్ ఇంటర్‌లో ఆల్‌టైమ్ హయ్యస్ట్ మార్కులు వరుసగా మూడోసారి నారాయణ సాధించడం ఎంతో గర్వకారణంగా అన్నారు. ఆరంభం నుంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ను పటిష్టమైన మైక్రోషెడ్యూల్స్‌గా రూపొందించి కాన్సెప్ట్యువల్ ఓరియంటేషన్‌లో విద్యాబోధన చేయడం వల్లనే తమ విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగారని తెలిపారు.

శరణి నారాయణ మాట్లాడుతూ తెలంగాణలోని నారాయణ విద్యా సంస్థల్లో జూనియర్, సీనియర్ ఇంటర్‌లలో అత్యథిక పాస్ పర్సంటేజ్ సాధించామన్నారు. సబ్జెక్టుల వారీగా విశ్లేషణాత్మక ధోరణిలో విద్యార్థుల మెథో సంపత్తిని పెంపొందించే విధంగా పాఠ్యాంశాల బోధన చేయటం అనేది నారాణ ప్రత్యేకతగా చెప్పారు. డాక్టర్ సింధూర నారాయణ మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నారాయణ అప్రతిహత విజయ ప్రస్థానానికి కొనసాగింపుగా నేటి ఇంటర్ ఫలితాలే నిదర్శనమన్నారు.

నేటి ఈ ఫలితాలే రేపటి జేఈఈ అడ్వాన్స్‌డ్, నీటి ఫలితాలకు సోపానమన్నారు. ప్రవేశ పరీక్షలన్నింటిలోనూ తమ విద్యార్థులే అత్యద్భుత ర్యాంకులు సాధిస్తారి ఆశాభావంవ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన తమ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి నారాయణ విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేశారు.