26 July, 2026 | 1:47 AM

నాణ్యమైన రెవెన్యూ సేవలే లక్ష్యం

26-07-2026 01:07 AM

విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు 

ఓదెల/పెద్దపల్లి, జూలై 25 (విజయక్రాంతి): ప్రజలకు పాలనను మరింత చేరువ చేస్తూ, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రూ.75 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయరమణరావు మాట్లా డారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 46 మంది పేద లబ్ధిదారులకు రూ. 46.30 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీరాములు, తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి పాల్గొన్నారు.