27-10-2024 01:23:02 AM
మహబూబ్‌నగర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయని.. వాటిని ప్రజలకు చేర్చేలా అధికారులు పనిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆదేశించారు.
శనివారం జిల్లా అభివృద్ధి, సమన్వ య, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు చేర్చాలని కోరారు. అందరం కృషి చేస్తేనే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పథకాలు ప్రవేశ పెట్టి ప్రచారం చేయకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.