16 March, 2026 | 2:44 AM

రోహిత్‌రెడ్డికి రిమాండ్

16-03-2026 01:12 AM

మాజీ ఎమ్మెల్యేతో పాటు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు 14 రోజుల జైలుశిక్ష 

చంచల్‌గూడకు తరలింపు 

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ సహా 8 మందికి స్టేషన్ బెయిల్

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఈ కేసులో అరెస్టయిన రోహిత్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మలకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఆదివారం రాత్రి వారికి వైద్య పరీక్షలు నిర్వ హించిన అనంతరం పోలీసులు ఉప్పర్‌పల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను భారీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు.

రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేసు తీవ్రతను, డ్రగ్స్ మాఫియాతో ఉన్న లింకులను పరిగణనలోకి తీసుకున్న మెజిస్ట్రేట్, బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఈ కేసులో ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్‌తో సహా ౮ మందికి స్టేషన్ బెయిల్ మంజూరైంది. 

తదుపరి విచారణపై దృష్టి..

డ్రగ్ పార్టీలో కీలక పాత్ర పోషించిన పైలట్ రోహిత్‌రెడ్డికి రిమాండ్ విధించడం తో, పోలీసులు ఇప్పుడు డ్రగ్స్ సప్లయర్లు, పార్టీకి హాజరైన ఇతర వీఐపీల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారిం చేందుకు పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ రాకెట్‌లో మరిన్ని పెద్ద తలకాయలు బయటపడే అవకాశం ఉండటం తో దర్యాప్తు సంస్థలు అత్యంత రహస్యంగా విచారణను కొనసాగిస్తున్నాయి.

రక్త పరీక్షలో దొరికిపోయిన ఎంపీ..

ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో శనివారం రాత్రి వీకెండ్ పార్టీ సాగుతోందన్న పక్కా సమాచారంతో ఈగ ల్ బృందం మెరుపు దాడి చేసింది. పోలీసులు లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో లోపల అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అధికారులు లోపలికి వెళ్లి సోదాలు చేయగా, ఢిల్లీకి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి నమిత్‌శర్మ అనే వ్యక్తి చేతిలో లోడెడ్ తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. నమిత్ పోలీసులను భయపెట్టేందుకే కాల్పులు జరిపారా.. లేక పార్టీలో జరిగిన అంతర్గత గొడవ వల్ల ఫైర్ ఓపెన్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది’ అని చెప్పారు. పట్టుబడ్డ ౧౧ మందిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. వారిలో పైలట్ రోహిత్‌రెడ్డి, పుట్టా మహేశ్‌కుమార్, అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మ ఉన్నారు.

శనివారం రాత్రే నిర్వహించిన టెస్టుల్లో అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మ, పైలట్ రోహిత్‌రెడ్డిలకు పాజిటివ్ రాగా ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్‌కు నెగిటివ్ వచ్చింది. ఆదివారం జరిపిన రక్త పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కాగా డ్రగ్స్ పార్టీలో ఉన్న రమేశ్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, సిలివేరి శరత్ కుమార్, ప్రియాంక రెడ్డిలకు పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ కేసులో ఎంపీ సహా ౮ మందికి స్టేషన్ బెయిల్ మంజూరు కావడంతో వారిని విడిచిపెట్టారు. 

మరిన్ని అరెస్టులు?

ప్రస్తుతానికి ఎంపీ మహేశ్‌కుమార్ సహా కొందరిని వదిలేసినా, విచారణ మాత్రం ఆగిపోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ పార్టీని ఎవరు నిర్వహించారు, ఎవరు సరఫరా చేశారు? ఢిల్లీ నుంచి ఆయుధాలు ఎలా వచ్చాయి అనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా మరికొంత మంది రాజకీయ ప్రముఖులకు, సినీ రంగ వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. 

డ్రగ్స్ వేటలో ‘ఈగల్’ రికార్డ్..

రాష్ర్టంలో డ్రగ్స్ మహమ్మారిని మూలాలతో సహా అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పా టు చేసిన ఈగల్ విభాగం ప్రస్తుతం మాఫి యా పాలిట సింహస్వప్నంగా మారింది. గత కొద్దికాలంగా ఈ ప్రత్యేక బలగం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతు న్నాయి. ఇప్పటి వరకు ఈగల్ బృందం రాష్ట్రవ్యాప్తంగా 450కి పైగా డ్రగ్స్ కేసులను నమోదు చేసి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్మగ్లర్ల నుంచి స్థానిక పెడ్లర్ల వరకు సుమారు 1200 మందికి పైగా నిందితులను కటకటాల్లోకి నెట్టింది.

కోట్లాది రూపాయల విలువైన కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, గంజాయిని ఈ విభాగం సీజ్ చేసింది. ఈగల్ టీమ్ నమోదు చేసిన కేసుల్లో దాదాపు 90 శాతం పైగా సక్సెస్ రేటు ఉండటం వీరి పనితీరుకు నిదర్శనం. ముఖ్యంగా ఫామ్‌దీతిజిజిహౌస్ కల్చర్, పబ్‌దీతిజిజిలపై నిరంతరం నిఘా ఉంచి, సంపన్న వర్గాల ముసుగులో సాగుతున్న చీకటి దందాలను బట్టబయలు చేయడంలో ఈ విభాగం అగ్రస్థానంలో నిలిచింది.