26 May, 2026 | 1:57 AM

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం

26-05-2026 12:43 AM

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ 

కొడంగల్, మే25(విజయక్రాంతి ):మహిళల ను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని కొడంగల్ మున్సిపాలిటీ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. డ్వాక్రా సంఘాల  మహిళలతో  సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న  ఉద్దేశ్యం తో మహిళలను అన్ని రంగాలలో  రాణించాలని సూదిద్దేశ్యంతో అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

సీఎం  సొంత నియోజకవర్గం అయిన కొడంగల్  మున్సిపల్ పరిధిలో ప్రత్యేక నిధులు మంజూరీ చేయించి  మహిళ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు. అందుకు డ్వాక్రా సంఘాల సభ్యులు తమ తమ వ్యాపారాలు కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనుకోవాలన్నారు. వాటికీ అనుగుణంగా నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ రాజశేఖర్, హమీద్ మరియు సీడిపీఓ  రాజేశ్వరి, ఆర్పీ లు ఆనందమ్మ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.