9 July, 2026 | 12:58 AM

సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

09-07-2026 12:21 AM

నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్

మొయినాబాద్, జూలై 8 (విజయక్రాంతి):రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి మెరుగైన గృహ వసతి కల్పించి, వారి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ స్పష్టం చేశారు. తోల్కట్ట గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన లబ్ధిదారుల నూతన ఇంటిని ఆయన సోమవారం ప్రారంభించారు.

మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్టలో మంగలి లలితజంగయ్య దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి భీమ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ మర్రి రవీందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.