9 July, 2026 | 1:39 AM

ఖండాలలో లేబర్ ఫోర్స్‌పై కేంద్ర కమిటీ సర్వే..

09-07-2026 12:57 AM

కేంద్ర గణాంక పతకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో..

ఉట్నూర్, జులై 8 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ను  నిర్వహించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఖండాల గ్రామంలో బుధవారం రోజున గణాంక శాఖ అధికారులు నిరంక్ వర్మ, మహమ్మద్ అన్సారీ, పురం ప్రతాప్ సర్వే చేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను, గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసి, అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా పట్టణంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి, యాదృచ్ఛిక పద్ధతిలో నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాగింగ్ వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. తదుపరి కుటుంబ యజమాని పేరు, సభ్యుల వారి విద్యా అర్హతలు, గృహించి, పడక మంచాలు, ఉన్నత చదువులు, పట్టివిద్యా కోర్సులు, ఉద్యోగం, స్వయం ఉపాధి, వివాహ రోజువారి కూలి అనుబంధ వివరాలు, ఎలాంటి పనులు చేస్తారు, ఎన్ని గంటలు పని చేస్తారు, ఎంత వేతనం పొందారు, వివరాలతో పాటు మహిళల స్వయం ఉపాధి పొందే వారు, ఆయా వివరాలను కూడా నమోదు చేసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మండల ఎఎస్ఓ, గ్రామ పంచాయతీ అధికారులు ఖండాల గ్రామ అధికారులు  గ్రామ సర్పంచ్ కుమ్ర శరధరామారావు, పంచాయతీ కార్యదర్శి గోడం అనిల్ కుమార్  గ్రామ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.