9 July, 2026 | 1:28 AM

అధ్వాన్నంగా మురికి కాలువలు

09-07-2026 12:31 AM

49 వార్డుల్లో ఇదే పరిస్థితి 

దోమలు ఈగలతో అవస్థలు పడుతున్నస్థానికులు 

పట్టించుకోని స్థానిక కౌన్సిలర్‌లు 

ఆందోళన చెందుతున్న ప్రజలు 

కామారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య సమస్య పడకేసింది. పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టిన పనులు చేయడంలో మార్పు రావడం లేదు. అధికారుల పాలనే నయమంటున్నారు స్థానిక ప్రజలు. స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆరు నెలలు గడుస్తున్న  కొన్ని వార్డుల్లో కనీసం ఒకసారైనా మురికి కాలువలను శుభ్రం చేయ లేదంటే ఎంత మేరకు పాలకుల కు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.

ఉధృతం అవుతున్న ఈగలు, దోమలు

వర్షాకాలం సీజన్ కావడంతో దోమలు ఈగలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కౌన్సిలర్లకు మురుగునీటి సమస్య, దోమలు, ఈగలు సాయం సమయంలో ఇండల్లోకి విజృంభిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. కౌన్సిలర్లకు అధికారులకు చెప్పిన మొక్కుబడిగా కొన్ని మురికి కాలువలను శుభ్రం చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా కామారెడ్డి పట్టణంలోని 19 వ వార్డు పరిధిలోని సైలన్ బాబా కాలనీలో ముర్కి కాలువలు ఆరు నెలల నుంచి శుభ్రపరచలేదు అని కాలనీవాసులు తెలిపారు. మురికి కాలువలు నిండిపోయి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుందని కాలనీవాసులు పేర్కొన్నారు.

పట్టించుకోవాలని  కోరుతున్న కాలనీల ప్రజలు

స్థానిక కౌన్సిలర్ కు చెప్పిన పట్టించుకోవడంలేదని, మున్సిపల్ అధికారులు సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆరు నెలలుగా మురికి కాలువలు శుభ్రపరచని వాటిని శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.

49 వార్డులలో పారిశుద్ధ్య  సమస్యలు

కామారెడ్డిలో 49 వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యల  పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. అసలే వర్షాకాలం సీజన్ కావడంతో దోమలు, ఈగలు వ్యాపించి అనారోగ్య సమస్య లు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పట్టించుకోని కౌన్సిలర్లు, అధికారులు

ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని కౌన్సిలర్‌గా గెలిచిన ప్రజాప్ర తినిధులు తమ సమస్యలను పట్టించుకోకుంటే ఇక ఎవరు పట్టించుకుంటారని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలలుగా శుభ్రపరచని మురికి కాలువలు

ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆరు నెలలుగా మురికి కాల్వలను శుభ్రపరచని చోట ముందుగా మురికి కాలువలను శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు.