calender_icon.png 18 July, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

18-07-2025 12:49:19 AM

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

శామీర్ పేట్, జూలై 17: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యం అని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ ఫం క్షన్ హాల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల లో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద లబ్ధిదారులకు చెందిన 619 ఎస్ హెచ్ జి సంఘాలకు రూ. 38 కోట్ల 86 లక్షలు, 3698 గ్రామ సంఘాలకు కోటీ 79 లక్షలు, 5 మంది మహిళలకు లో న్ భీమా కింద 3 లక్షల 19 వేల చెక్కులను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ మ ను చౌదరి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తో కలిసి పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశా రు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా శిక్షణ, ఉపాధి, స్వావలంబన దిశగా మహిళలు అడుగులు వేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుందన్నారు. వ్యవసాయ రంగంలో గేదెలు, కోళ్ల, చేపల పెంపకం, డైరీల ని ర్వహణ తోపాటు, పారిశ్రామిక రంగంలో వాళ్లను ముందడుగు వేసేలా ఆర్టీసీ బస్సుల కొనుగోలు, పెట్రోల్ పంపుల నిర్వహణ, తదితరాలలో మహిళలకు అవసరమైన చేయూతని స్తున్నా మన్నారు మేడ్చల్ జిల్లాలోనూ 5 మండల సమాఖ్యలు ,118 గ్రామ సమాఖ్యల లో ఉన్న 3495 ఎస్ హెచ్ జి ల్లో 39 వేల 642 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ ద్వారా అవసరమైన ఆర్థిక సహకారం వడ్డీ లేని రుణాల రూపంలో అందిస్తున్నామని తెలిపారు.

2024 -25 లో 2,794 సంఘాలకు 220 కోట్ల 68 లక్షలు విడుదల చేశామని, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై నాటికి 619 సంఘాలకు 39 కోట్ల రుణాలను అందించడం జరుగుతుందని చెప్పా రు. వడ్డీ లేని రుణాల వడ్డీ రాయితీగా 2023 - 25 వరకు 2,911 సంఘాలకు రూ. 8 కోట్ల 75 లక్షల వడ్డీ డబ్బులను వారి ఖాతాలో జమ చేశామన్నారు . స్త్రీ నిధి రుణాలుగా 2024- 25 లో రూ.16 కోట్ల 51 లక్షల రుణాలు ఇచ్చామని, చిన్న వ్యాపారులకు 1698 యూనిట్లకు గాను రూ. 35 కోట్ల రుణాలు అందించాంమన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలలకు గాను 697 పనులకు రూ .8 కోట్ల 14 లక్షలు మహిళా సంఘాల ద్వారా అందించాము. రైతుల కోసం రైతు భరోసా వేశామని, రుణమాఫీ, ఎరువుల పంపిణీ తదితరులు చేసి వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మల పల్లి నరసింహులు యాదవ్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మార్వో యాదగిరి రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, ఆర్టిఏ నెంబర్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.