calender_icon.png 18 July, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న చలో గాంధారిని విజయవంతం చేయాలి

18-07-2025 12:48:21 AM

గిరిజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ 

కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి), చలో గాంధారి కార్యక్రమాన్ని గిరిజనులు విజయవంతం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న గాంధారి మండల కేంద్రంలో నిర్వహించనున్న గిరిజన సదస్సుకు డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలోని గిరిజనులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ప్రధాన సమస్యలైన పోడు భూములు అసైన్మెంట్ భూముల పై అవగాహన కల్పించడం, ధర్మసమాజి పరిరక్షణ కోసం అవగాహన, గిరిజన సమ స్యలపై రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్ లో గోరుబోలి భాషను చేర్చాలని ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి తెలియపర చడం జరుగుతుందన్నారు. గిరిజన సోద రులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ శంకర్  నాయక్, పరశురాం, బన్సీ లాల్ నాయక్, దేవి సింగ్, మోహన్, గోపి నాయక్, వసంత్, పీర్ సింగ్ నాయక్, శీను నాయక్, రవీందర్ నాయక్, ప్రకాష్ నాయక్, విజయ్ ,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ &బి గెస్ట్ హౌస్ లో జిల్లా స్థాయి సమావేశము జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ గార్లు  మాట్లాడుతూ....... కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో గిరిజన గర్జన సభ పెట్టాలని నిర్ణయించినాము సభ జరిగే సమయము తేదీను ప్రకటించడం జరిగింది .ఈనెల తేదీ 27/7/2025 ఆదివారం రోజున మారుతి ఫంక్షన్ హాల్ లో సభ జరుగును .

సదస్సుకు ముఖ్యఅతులుగా డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్ గారు,గిరిజన కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు వస్తున్నారని వారు తెలియజేశారు.