calender_icon.png 18 July, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

18-07-2025 12:50:05 AM

అర్మూర్, జులై 17 (విజయ క్రాంతి) : అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న గురువారం ఆర్మూర్ లో చోటుచేసుకుంది. పట్టణంలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన నీరుగంటి శశికళ అనే మహిళ ఇంటిలో పైపుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే కాలనీకి చెందిన గంధం శ్రీనివాస్ దగ్గర 15 వేలు అప్పుగా తీలుకొని 36 వేల  వడ్డీ కట్టింది.

అసలు కట్టమని వేధించగా కట్టలేమన్నందుకు  చచ్చిపోండి బెదిరించినట్లు కుటుంబీకులు వాపోయారు.  అతనిపెట్టే బాధలు భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి  కుమారుడు యోగేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంధం శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలు వసూలు చేసి వేధిస్తే ఆర్మూర్ పోలీసులను సంప్రదించగలరని కోరారు. మీరిచ్చే ఫిర్యాదుపై వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.   అనవసరంగా మీ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు  విజ్ఞప్తి చేశారు.