7 March, 2026 | 11:08 AM

ప్రజలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యం

07-03-2026 12:00 AM

డిప్యూటీ కమిషనర్ వాణి

ఘట్ కేసర్, మార్చి 6 (విజయక్రాంతి): ప్రజలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యం అని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. శుక్రవారం ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో 99 డేస్ యాక్షన్ ప్లాన్  ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు.

కార్యాలయానికి వచ్చే ప్రజలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి పర్యవేక్షించి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. నగర పరిశుభ్రతను మెరుగుపరచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.