8 August, 2026 | 2:35 AM

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

08-08-2026 01:30 AM

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్, ఆగష్టు 7 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయమని మేడ్చల్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధి శంభీపూర్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మహిళలు మేడ్చల్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా పలు ప్రాంతాలలో జరగబోయే బోనాల పండుగ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు.