ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రతి రోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రజా దర్బార్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశం తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన కార్యాలయంలో ప్రతి రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తు న్నారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రాం తాల నుండి వచ్చే ప్రజలు తమ సమస్యలను నేరుగా మల్లన్న గారికి వినిపిస్తూ తక్షణ పరిష్కారాన్ని పొందుతున్నారు.
ప్రజలతో నేరుగా భేటీ అవుతూ, వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం మా ప్రధాన అజెండా. ప్రజ ల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా వారి పక్కనే నిలబడటం మా బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నది. తమ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం లభిస్తోందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నేడు యాదాద్రి జిల్లాకు మల్లన్న..
టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామంలో నిర్వహించనున్న గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుండి బయలుదేరి, కార్యక్రమ స్థలానికి చేరుకోనున్నారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.




