25 May, 2026 | 7:02 PM

Breaking News

ట్రాక్టర్ బోల్తా.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం   •   ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •   ఈత సరదా విషాదంగా మారొద్దు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •  

ఓయూ పరిపాలన భవనంలో ఏసీబీ దాడులు

02-04-2026 01:25 AM

యూనివర్సిటీ బిల్స్ సెక్షన్‌లో పనిచేసే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ అరెస్టు

సికింద్రాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ పరిపా లన భవనంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం యూనివర్సిటీ బిల్స్ సెక్షన్లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ.13 వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఏసీబీ డిఎస్ పి జి.శ్రీధర్ వివరాలు వెల్లడించారు.

ఓయూ ఇంజనీరింగ్ సెక్షన్కు చెందిన రిటైర్డ్ మహిళ తన పెన్షన్ ఫైల్ ప్రాసెసింగ్ కోసం చాలా రోజులుగా తిరుగుతుంది. బిల్స్ సెక్షన్ సిబ్బంది పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు బిల్స్ సెక్షన్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అరవింద్ను వసంప్రదించాడు. ఈ క్రమంలో అరవింద్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. అక్క డే సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే మరో వ్యక్తి రమేష్ను సంప్రదించాడు.

ఆయనతో రూ.13 వేలకు ఒప్పందం కుదుర్చు కున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలి కుమారుడు ఐదు రోజుల క్రితం ఏసీబీకి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం బుధవారం ఓయూ సమీపంలోని బస్ స్టాప్ వద్ద లంచం తీసుకుంటుండగా రమేష్ నుఅదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరవింద్ వ్యవహారం బయటపడగా ఆయనను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దరిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.