ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కొలన్ శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి(Congress party leader Kolan Srinivas Reddy) పేర్కొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ 2వ డివిజన్ చందు లేఔట్, ఎన్ఆర్ఐ కాలనీ వాసులు అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డిని తన కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాలనీలో పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కాలనీలో నెలకొని ఉన్నటువంటి సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, వేముల శ్రీనివాస్, శరత్ రెడ్డి, సందీప్ గౌడ్, జానకిరామ్, శివ, రమేష్, శ్రీనివాస్ దార్కోల్, విజయ్ రెడ్డి, త్రిమూర్తులు, శ్రీకాంత్ తోట తదితరులు పాల్గొన్నారు.






