17 April, 2026 | 11:02 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యువకులు డ్రగ్స్ నుండి అప్రమత్తంగా ఉండాలి

22-06-2025 06:17 PM

నాగారం: యువకులు డ్రగ్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని నాగారం మండల ఎస్ఐ ఐలయ్య(SI Ilaiah) అన్నారు. ఆదివారం నాగారం మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా నాగారం సర్కిల్ పరిధిలోని నాగారం పోలీస్ స్టేషన్(Nagaram Police Station) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై ఐలయ్య మాట్లాడుతూ... సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

యువత విద్యార్థులు బాలలు రేపటి దేశ భవిష్యత్తు అని మీలాంటి యువత మాదకద్రవ్యాల బారిన పడి భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల మన యొక్క నాడీ వ్యవస్థ మన ఆధీనంలో ఉండదు అని తద్వారా శక్తి నిర్వీర్యం అవుతుందని ఇలాంటి వాటి నుండి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు.