కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీముడు నాయక్
చారకొండ ఏప్రిల్ 3: మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేతావత్ భీముడు నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ కు, ఎన్నికకు సహకరించిన మండల, జిల్లా నాయకులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలను అందరినీ కలుపుకుని పోతూ మండలంలో పార్టీ విజయానికి శ్రమిస్తానని తెలిపారు.




