6 May, 2026 | 4:11 AM

యాదగిరిగుట్టను రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

06-05-2026 02:50 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, మే 5: యాదగిరిగుట్టను రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం అని దీనికోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో కో ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అధ్యక్షతన నిర్వహింఛారు.

ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఎంపికైన గౌలికర్ అరుణ రాజేష్ ,ఎం.డి రహిమ సలాం, బండి జంగమ్మ , షేక్ ఉస్మాన్ షరీఫ్‌లకి ఆయన నియామక పత్రాలు అందజేయగా తదుపరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల అప్పుడే పార్టీలని ఎన్నికల అనంతరం ఆయా పట్టణాలు, గ్రామాలలో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.

యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరూ  పార్టీలకు అతీతంగా ముందుకు రావాలన్నారు. కాగా కో ఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ మెన్ బరిగే రమ్య రామచందర్, కౌన్సిల్ సభ్యులు బూడిద మధు, మాలోతు సరోజ హరీష్ , పెలిమెల్లి లావణ్య శ్రీధర్, సాధునెని ధనలక్ష్మి మధుకర్, ముక్కెర్ల మల్లేష్, బబ్బూరు శ్రీధర్ గౌడ్,ఇంచార్జ్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.