ముగిసిన ఎప్‌సెట్ అగ్రికల్చర్ పరీక్షలు
06-05-2026 02:49 AM
93.38 శాతం మంది విద్యార్థుల హాజరు
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి. మంగళవారం 94.33 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు టీజీ ఎప్‌ఎస్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో మొత్తం మూడు సెషన్‌లలో కలిపి 93.38 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. ఇక ఈనెల 9 నుంచి 11 తేదీల్లో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగానికి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.






