16 April, 2026 | 7:49 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రజల మౌలిక వసతుల కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

23-06-2025 10:11 PM

మండలాలను అనుసంధానం చేస్తూ నూతన డబల్ రోడ్డు నిర్మాణాలు..

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు...

పెద్దపల్లి (విజయక్రాంతి): బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేసిందని, ప్రజల మౌలిక వసతుల కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) విమర్శించారు. జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుండి గర్రెపల్లి వరకు రూ.6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో పలు గ్రామీణ రహదారులు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఎలిగేడు నుండి సుల్తాన్ పూర్ వరకు గర్రెపల్లి రోడ్డు వైపుగా రూ.6 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు నాలుగు పోలీస్ స్టేషన్ లను ప్రారంభించుకున్నాం అలాగే త్వరలోనే సుగ్లంపల్లి నుండి ముప్పిరితోట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలు పంపించడం జరిగింది.

నియోజకవర్గంలో ఏడాది లోపు గ్రామీణ రోడ్లు పూర్తి చేస్తాం అని తెలిపారు. గ్రామీణ ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సమా రాజేశ్వర్ రెడ్డి, దుగ్యాల సంతూష్ రావు, అర్షణాలి వెంకటేశ్వర్ రావు, కోరకంటి వెంకట్వశ్వర్ రావు, నర్హరీ సుధాకర్రెడ్డి,  రమేష్ బాబు, బూర్ల సత్యం, సత్యనారాయణ, రమేష్, తిరుపతి, రాంచంద్రం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.