13-10-2025 12:00:00 AM
ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంపర్క ప్రముఖు కుమ్మరి కుంట సుధాకర్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 12 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం లో ఆర్‌ఎస్‌ఎస్ నిత్య శాఖల ద్వారా వ్యక్తుల నిర్మాణం చేసి వారిని అసలైన దేశభక్తులుగా తయారు చేస్తుందని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే ఆర్‌ఎస్‌ఎస్ పనని ఉమ్మడి కరీంనగర్ సుధాకర్ అన్నారు ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన పద సంచలన్ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారత దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగడం ఇష్టం లేక మన దేశంపై మనపై ఆంక్షలు విధించే ప్రయత్నాలు సాగిస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోందన్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడంతో అనేక ఇండ్లలో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి పిల్లలు విదేశాలలో స్థిరపడి తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్నారు దీనివల్ల రానున్న తరాల ప్రజలు ఉంటుందని కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం వల్లే విదేశీయులు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన మన సంస్కృతిని ఏమి చేయలేకపోయారని అన్నారు.
దేశంలో అందరికీ ఆహారం దుస్తులు నీడ విద్య ఆరోగ్యం అందించి సగర్వంగా ప్రజలు జీవించే పరమ వైభవ స్థితిని సంఘం కోరుకుంటుందని దానికోసమే సంఘం వంద సంవత్సరాలుగా పనిచేస్తుందన్నారు.వంద సంవత్సరాలుగా ఒకే సిద్ధాంతం పై ఎలాంటి విభేదాలు ముందుకు సాగుతున్న ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అన్నారు ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ మడుపు శ్రీకాంత్ రెడ్డి, చిలుక వేణు కిరణ్ తోపాటుగా దాదాపు 500 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.