calender_icon.png 13 October, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలహీనమవుతున్న ప్రజల బ్రహ్మాస్త్రం

13-10-2025 12:00:00 AM

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డి ట్రైనర్ అష్రఫ్ 

కాగజ్‌నగర్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): మండల కేంద్రంలో సమాచార హక్కు చట్ట అమలు దినోత్సవాన్ని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టిఐ ఆక్టివిస్ట్లు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రైనర్ అష్రఫ్, సహ రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడుతూ ప్రజల చేతిలో శక్తివంతమైన ఆర్టిఐ అస్త్రం బలహీనమవుతుందని అన్నారు.

సమాచారం పొందడం ప్రతి ఒక్క పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమన్నారు కానీ సహ చట్టం దేశంలో అమలు నేటితో 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, సహ చట్టం అమలులో, చట్టబలోపేతంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందన్నారు. గ్రామస్థాయి వర కు గల ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం లేదన్నారు.

సెక్షన్ 4 (1) (బి) ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన 17 అంశా లు సమాచారం అందుబాటులో ఉండడం లేదన్నారు. చట్ట నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు పిఐఓ, ఏపీఐవోలు సమా చారం అందించడం లేదన్నారు. దరఖాసుదారుల, ఆర్టిఐ కార్యకర్తల వివరాలు బహి ర్గతం అవుతున్నాయని, దానితో వారిపై దాడులు, ఇతర నష్టాలు చేకూరుతున్నాయన్నారు. దరఖాస్తుదారుల రక్షణ కొరకు గల మెమో నెంబర్: 33086 ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

రాష్ట్ర సమా చార కమిషన్ సెక్షన్ 20 ప్రకారం అనుసరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రాష్ట్ర కమిషనర్ సుప్రీం కోర్టు తీర్పులు, కేంద్ర సమాచార కమిషన్ తీర్పులు, రాజ్యాంగబద్ధమైన ఇతర చట్టాలను ప్రమాణికం చేసుకొని రూల్ ఆఫ్‌ల ప్రకారం ఏపీ ఐవో, పిఐఓ, ఏవో పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. సహ చట్టబలోపితం కొరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయవలసిన ఆర్టిఐ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. 

సహ చట్టం రక్షణ కొరకు, దరఖాస్తు దారుల, ఆర్టీఐ కార్యకర్తల పరి రక్షణ కొరకు, ప్రజల రాజ్యాంగ బద్దమైన హక్కుల కొరకు ప్రతి ఒక్క ఆర్టీఐ, సామాజిక కార్యకర్తలు, మేధావులు ఒకే వేదిక పైన వచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టిఐ కార్యకర్త అజీమ్ పేరుతో జాగృతి యువ మంచ్ ఆధ్వర్యంలో రూపొందించిన సమాచార హక్కు చట్ట దరఖాస్తు పత్రాలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా అధ్యక్షులు కబీర్, జిల్లా కార్యదర్శి వంగారి ప్రవీణ్, జిల్లా అడ్వైజర్ రామ్టెంకి కృష్ణ, జిల్లా ప్రచార కార్యదర్శి దుర్గం శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న, డివిజన్ జాయి న్ సెక్రటరీ అఖిలేష్, ఆర్టీఐ కార్యకర్త శరత్ చంద్ర, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.