ప్రజాపాలనలో బడుగులకు రక్షణ ఏదీ?
కౌన్సిలర్ ని అరెస్ట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం.. తాండూరు ప్రజా సంఘాలు
తాండూరు, మార్చి 29 (విజయ క్రాంతి): ప్రజా పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వికారాబాద్ జిల్లా తాండూర్ అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మనపురం రాము రజక సంఘం నాయకులు కృష్ణ,, రాజు పై దాడి చేసి ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాండూర్ ప్రజాసంఘాల నాయకులు ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ మనప్పురం రాము ధోబి కబ్జా చేసేందుకు ప్రహరీ గోడ కూల్చాడని అతడి పై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు . అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని వారు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ,టీజేఎస్ నాయకులు సోమశేఖర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ కుమార్, మైనార్టీ నాయకులు అబ్దుల్ వాహబ్, రజక సంఘం పట్టణ శాఖ అధ్యక్షులు రాజు నాయకులు శాంత కుమార్, పెంటప్ప, బిచ్చప్ప, రాజు, సురేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.




