calender_icon.png 23 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలాత్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు

23-09-2025 01:25:37 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): నిజామాబాదు నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దుర్గా పరమేశ్వరి అమ్మవారి మందిరము లో ఏర్పాటుచేసిన  నవరాత్రుల ప్రారంభోత్సవ ఉత్సవంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భక్తిశ్రద్ధలతో పూజలు అర్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మ వారి అలంకరణ సందర్భంగా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సం. దర్బంగా సిపి మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా దేవీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.  ప్రతి ఒక్కరికీ మాత అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులకు పోలీస్ కమీషనర్ స్వయంగా ప్రసాదాన్ని ఒడ్డించారు.

ఈ సందర్భముగా  అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ( అడ్మిన్ ), శ్రీ  ఎంటిఓ శ్రీ శేఖర్ బాబు  ( ఎం టి ఓ), తిరుపతి ( వెల్ఫేర్ ),  శ్రీ సతీష్  ( హోమ్ గారడ్స్ ) తో పాటు దుర్గా పరమేశ్వరి మాత మందిరం ఆర్గనైజర్స్ సిబ్బంది,  పోలీస్ కార్యాలయం సిబ్బంది ,  స్పెషల్ పార్టీ సిబ్బంది, ప్రధాన అర్చకులు జోషి వెంకటేష్ శర్మ తదితరులు అమ్మవారి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎల్లారెడ్డి పట్టణంలో..

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో సోమవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో చైతన్య యూత్ మరియు హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంతో నింపాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చరు,

ఉదయం వేకువజామునే భక్తులు ఆలయానికి చేరుకుని భవాని దీక్షను స్వీకరించారు. అనంతరం పండితులు వేద మంత్రాల మధ్య అమ్మవారి ప్రతిష్ఠాపన చేశారు. అభిషేకాలు, అలంకరణలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.  సభ్యులు ప్యాలాల రాములు, సంగమేశ్వర్ , పప్పు వెంకట్, రమేష్, ప్రభాకర్, శివప్రసాద్, విద్యాసాగర్, నవీన్, అర్జున్ గౌడ్, సాయి, భాను, అర్జున్, ఫణి, కిరణ్, రాహుల్,  సూర్య, కపిల్, తరుణ్, సాయిరాజ్, భాస్కర్, మధు, చందు, సంజయ్, ఈశ్వర్, వినీత్, నాగబాబు, సన్నీ, నిహళ్, మాత స్వాములు తదితరులు  పాల్గొన్నారు.