వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పాలకవర్గం కృషిచేయాలి: ఎమ్మెల్యే
ఇల్లెందు, ఏప్రిల్ 6,(విజయక్రాంతి): ఇల్లందు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పాలకవర్గం నిరంతరంగా కృషి చేయాలనీ ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మార్కెట్ కమిటి కార్యాలయంలో పాలకవర్గం సమావేశం సోమవారం చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా హజరై ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. మార్కెట్ కమిటీ నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం సుధీర్ఘ చర్చ చేపట్టారు. మార్కెట్ పరిధిలోని ఆదాయ, వ్యయాలపై డైరెక్టర్లకు చైర్మెన్ వివరించారు. మార్కెట్ పరిధిలో చెపట్టవలసిన నూతన పనులకు పాలకవర్గం తీర్మాణం చేశారు. గార్ల, బయ్యారం మండలాలలో నూతన చెక్ పోస్ట్ ల ఏర్పాటుకు ఏకగ్రీవంగా అమోదం తెలిపారు.
మార్కెట్ లో ప్రహరి నిర్మాణం, హమాలీల సంఖ్య పెంపు, మార్కెట్ ఉదోగ్యుల సంఖ్య పెంపు, సింగరేణి అప్పాయిగూడెం గౌడౌన్ రహదారి విషయం పై వైరా శాసన సభ్యులు గారితో కలిసి సమస్య పరిష్కరించాలని తీర్మానించారు. ఇల్లందు మార్కెట్ పరిధిలోని రైతులందరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపే విధంగా అవగాహన కల్పించాలని డైరెక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో ఇల్లందు మున్సిపాలిటి చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్, మార్కెట్ స్పెషల్ ఆఫిసర్ నరేందర్, మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ బిజ్జా వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు జారా సమ్మక్క, గుగులోత్ గబ్రు నాయక్, మాళోత్ బావుసింగ్, బొల్లి రాజు, కుంజా వసంతరావు, జిగట వెంకన్న, బానోత్ జింకు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.




