ముగిసిన నేషనల్ మహిళా సైక్లింగ్ పోటీలు
నాగోల్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): నాగో ల్, బండ్లగూడలో నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ నేషనల్ సైక్లింగ్ లీగ్ పోటీ లు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు క్రీడా రంగం లో ముందుకు రావడం ఆనందదాయకమని, కేంద్ర ప్రభుత్వం క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడాకారులకు అండగా ఉంటుందన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి సబ్-జూనియర్, జూనియర్, ఎలైట్ విభాగాల్లో మొత్తం 120 మంది మహిళా సైక్లిస్టులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, శంతన్, సెంట్రల్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ నల్లి జ్యోతి కుమార్, వోబులేశ్ యాదయ్య, మేజర్ జనరల్ శ్రీనివాస్, నిర్వాహకులు డా. మాక్స్వెల్ శ్రీకాంత్ పాషా శ్రీకాంత్ తదితరులు, క్రీడా ప్రముఖులు, కోచ్‌లు పాల్గొన్నారు.




