7 April, 2026 | 3:11 AM

మన అగ్రిటెక్ సందర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

07-04-2026 12:52 AM

వ్యవసాయ పరికరాలు బాగున్నాయని ప్రశంసలు 

వరంగల్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): మన అగ్రిటెక్ ఆధునిక వ్యవసాయ పరికరాల ఎక్స్ పో చాలా బాగుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరా జు అన్నారు.వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో గత పది సంవత్సరాలుగా రైతులకు సేవలందిస్తూ రైతన్న మన్ననలు పొందిన మన అగ్రిటెక్ సంస్థ ఈ నెల 13, 14, 15 తేదీ ల్లో మెగా మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఎనమాముల మార్కెట్ కు విచ్చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని మన అగ్రిటెక్ అధినేత పాసికంటి రమేష్ మన అగ్రిటెక్‌కు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మన అగ్రిటెక్‌ను సందర్శించిన ఎమ్మెల్యే నాగరాజుకు అధినేత రమేష్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తదనంతరం మన అగ్రిటెక్‌లో ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ ఎమ్మెల్యేకి ఒక్కో స్టాల్ లో ఉన్న పరికరాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయం రైతులకు ఎంతో మేలని ఆధునిక పరికరాల ఉపయోగం ద్వారా కూలీల కొరత తగ్గి రైతులకు ఖర్చు ఆదా అవుతుందన్నారు.  కార్యక్ర మంలో మార్కెట్ సిబ్బంది, ముఖ్యులు, మన అగ్రిటెక్ సిబ్బంది పాల్గొన్నారు.