1 June, 2026 | 3:40 AM

నిజమైన ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం

01-06-2026 02:38 AM

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్

ముషీరాబాద్, మే 31(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తోందని  ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు  ప్రొ.కోదం డరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్  కోదండరామ్, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మోతే శోభన్ రెడ్డి లు ముఖ్య అతిదులుగా హాజరై మాట్లాడారు.

రాష్ట్ర సాధనలో ప్రజలందరి భాగస్వా మ్యం ఉన్నప్పటికీ ఒక వ్యక్తి వల్లే తెలంగాణ వచ్చిందని, మిగతా వారి పాత్ర లేదని అప్ప టి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అబ్దపు ప్రచారం చేసిందని ఆరోపించారు. పదేళ్లుగా మన ప్రస్తావన, ఉనికి లేకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. ఇది తీవ్ర అన్యాయమని, అనేక మంది ప్రాణత్యాగాలు, బలిదానాలు, పోరాట ప్రతిమతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం గుర్తించి కమిటీ వేసిందన్నారు. మొదటి సమావేశం శనివారం కమిటీ సభ్యులు అధికారులతో సమావేశం నిర్వహించిందని తెలి పారు.

నిజమైన ఉద్యమ కారులను గుర్తించేందుకు ప్రక్రియ ముందుకు సాగుతోం దన్నారు. జూన్ 4న అఖిలపక్షం సమావేశం లో ఉద్యమకారులతో కూడా కమిటీ చర్చిస్తోందని తెలిపారు. త్వరలోనే విధి విధానా లు రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు జ్యోతి రెడ్డి, ఐలయ్య యాదవ్,  సంజీవరెడ్డి,  రజనీకాంత్,  దయానంద్, జగన్ యాదవ్, శీలం స్వామి, కొట్టే శేఖర్,  ఆనంద్, భూపాల్,  అ నంతలక్ష్మి ఐల ప్రసన్న పాల్గొన్నారు.