27 July, 2026 | 8:50 PM

Breaking News

ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలి

01-06-2026 02:37 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఖైరతాబాద్, మే 31 (విజయక్రాంతి): ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. సోమాజిగూడ డివిజనులోని ఉమానగర్ కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన కేంద్ర మంత్రి,ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తో కలసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగుతామన్నారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పార్కుల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. అన్ని వయసుల వారు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.