2 May, 2026 | 1:52 AM

ఆర్టీసీ కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

02-05-2026 12:00 AM

హుస్నాబాద్, మే 1: హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆర్టీసీ కార్మికుడు కె.ఎస్. చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు సభలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ప్రపంచ కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు వివరించారు. త్వరలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.