సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్
- తెలంగాణ రాష్ట్ర కమిషనర్ శైలజ
- హెల్ప్ ఏజ్ ఇండియా నివేదిక విడుదల
ముషీరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణా అవగాహన దినోత్సవం(డబ్ల్యూఈఏఏడీ) 2026 సందర్భంగా హెల్ప్ ఏజ్ ఇండియా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ’క్లైమేట్ రెజిలియెంట్ ఏజింగ్-ఎన్ష్యూరింగ్ కేర్, డిగ్నిటీ అండ్ ఏజెన్సీ’ జాతీయ నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం వృద్ధులపై, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలపై తీవ్రంగా ఉంటోందని నివేదిక పేర్కొంది. సందర్భంగా వెల్ఫేర్ ఆఫ్ డిసేబుల్డ్, సీనియర్ సిటిజన్స్ తెలంగాణ రాష్ట్ర కమిషనర్ బి. శైలజ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలో సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ (ఎన్‌ఐఆర్ డీపీఆర్), హమీదా బీ (ఉస్మానియా యూనివర్సిటీ), ప్రొఫెసర్ అసిఫ్ ఖురేషి, పద్మజా కరణం (ఐసీఆర్‌ఐఎస్‌ఎటి), నాగ చంద్రికా దేవి, జి.నాగేశ్వర రావు, యెంతెండ్ర యాదవ్ పాల్గొన్నారు. అనంతరం నివేదిక అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహించి, వాతావరణ సవాళ్లు, కమ్యూనిటీ మద్దతు వ్యవస్థలు, సమగ్ర విధానాల అవసరంపై నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు.






