గడువులోగా పనులు పూర్తి చేయాలి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూన్ 15: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసు కొని రావాలని పటాన్చెరు శా సనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలోని 9 డివిజన్ల లో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీలలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున.. పారిశుధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెప్తాను తరలించడంతోపాటు ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బొల్లారం స్టేడియం, పాటి వివేకానంద స్టేడియంల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు సర్కిళ్లకు సంబంధించిన 250 కోట్ల నిధులు తిరిగి డివిజన్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కేటాయించాలని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ సమా వేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమా ర్, జ్యోతి రెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈ లు ఫైజాన్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.






