పేదల భూములతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం
- బీజేపీ ఎల్బీనగర్ ఇంచార్జి సామ రంగారెడ్డి
- హయత్‌నగర్ శివారులో ప్రభుత్వ భూముల పరిశీలన
ఎల్బీనగర్, జులై 31 : రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని బీజేపీ ఎల్బీనగర్ ఇన్చార్జి సామ రంగారెడ్డి, హయత్నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి విమర్శించారు. హయత్ నగర్ మండలం హన్నగల్ లోని వివాదాస్పద భూములను శుక్రవారం పరిశీలించారు. హయత్నగర్ మండల పరిధిలోని హన్మగల్ హయత్నగర్ ముదిరాజ్ కాలనీలో గల సర్వే నెం. 255/1లో మొత్తం 74 ఎకరాల 37 గుంటల భూమి ఉంది.
ఇందులో ప్రజా అవసరాల కోసం కొంత భూమిని వినియోగించగా, మిగిలిన భూమిలో రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది రైతులు కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా తమ భూమిని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి 60, 100 గజాల చొప్పున పేద, మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించారు. మిగిలిన భూమిపై ప్రస్తుతం వందలాది కుటుంబాలు ఆధారపడి జీవ నం సాగిస్తున్నాయి.
అయితే, ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న సమాచారం రావడంతో సామ రంగారెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి భూములను పరిశీలించి, రైతులు, ప్లాట్ల యజమానులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1971లో అప్పటి ప్ర భుత్వం ప్రభుత్వ భూ ముల్లో సాగు చేస్తున్న అర్హులైన రైతులకు పట్టా పుస్తకాలు అందజేసిందని, ఆ పట్టాలను నమ్ముకుని రైతులు ఎన్నో సంవ త్సరాలుగా సాగు చేశారని గుర్తు చేశారు.
అనంతరం కొంతమంది రైతులు తమ కు టుంబ అవసరాల కోసం భూములను విక్రయించగా, ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన పేద ప్రజలు తమ జీవితకాల పొదుపు మొ త్తాన్ని వెచ్చించి స్థలాలు కొనుగోలు చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గతం లో ప్రభుత్వం ఇచ్చిన హక్కులను ఇప్పుడు తిరస్కరించి అదే భూమిని తిరిగి స్వాధీనం చే సుకోవడం ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం పే రుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇ ప్పుడు పేదల భూములను స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా ఆరోపించారు.






