1 August, 2026 | 1:07 AM

డ్రైడేతో సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యం

01-08-2026 12:00 AM

అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్

పెబ్బేర్, జూలై 31: డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి వారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెబ్బేర్ మున్సిపాలిటీ 7వ వార్డు, బునియాదిపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.