పెద్దనట్టు భూమిపై అఖిలపక్ష సమావేశం
01-08-2026 12:00 AM
చిన్నంబావి, జూలై 31: కొప్పునూర్ గ్రామ పెద్దనట్టు 116 ఎకరాల భూమికి సంబంధించి జీవో- 99ను వ్యతిరేకిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జీవో-99ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు పశువుల మేత అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమిపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






