10 June, 2026 | 2:14 AM

ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది..

10-06-2026 01:34 AM

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

జనగామ, జూన్ 9 (విజయక్రాంతి): జనగామ జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 132/33 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామం లో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి,  ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో చేప ట్టిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్లకు ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.

ఈ సంద ర్భంగా మొత్తం (60,838) మంది వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూ ర్చే విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృ ద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 132/33 కేవీ పీచర సబ్ స్టేషన్  రూ. 43.92 కోట్లు, వేలేరు మండలంలోని పీచరలో 2x10/16 ఎంవీఏ సామర్థ్యంతో ని ర్మించిన 132/33 కేవీ సబ్ స్టేషన్ను, 33/11 కేవీ కొండాపూర్ సబ్ స్టేషన్  రూ.2.50 కో ట్లు, 33/11 కేవీ సాగరం సబ్ స్టేషన్  రూ.2. 29 కోట్లు, 33/11 కేవీ కుర్చపల్లి సబ్ స్టేషన్ రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఉప ముఖ్య మంత్రి ప్రారంభించారు.

అలాగే చిల్పూర్ మండల పరిధిలో రూ. 9.66 కోట్ల వ్యయం తో మూడు నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి, పల్లగుట్ట 33/11 కేవీ సబ్ స్టేషన్  రూ. 3.25 కోట్లు, లింగంపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్  రూ. 2.81 కోట్లు, నష్కల్ 33/11 కేవీ సబ్ స్టేషన్  రూ. 3.60 కోట్ల వ్య యంతో నిర్మించనున్న అభివృద్ధి  పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడు తూ.. ఈ ప్రాంతం ఒకప్పుడు వలసలకు నిలయంగా ఉండేదని పేర్కొన్నారు.

ఆ పరిస్థితు లను మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలి పారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాలన్నా విద్యుత్ అవసరమేనని స్పష్టం చేశారు. అందుకే విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తూ, అవసరాలకు అనుగు ణంగా నవీకరణ చేస్తూ అనేక అభివృద్ధి ప నులకు ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజల డిమాండ్కు అ నుగుణంగా విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ప్రజల క్షేమం కోసం ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అదే వి ధంగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు ప్ర భుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉప ము ఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేవదుల ప్రా జెక్ట్ను త్వరలోనే పూర్తి చేస్తామని ధీమా వ్య క్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడి యం కావ్య, ఆయిల్ ఫిట్ కార్పొరేషన్ చైర్మ న్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రా జేందర్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, డిసిసి అ ధ్యక్షురాలు, లకావత్ ధన్వంతి, కలెక్టర్ సం దీప్ కుమార్ జా, మున్సిపల్ చైర్మన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.