13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

హెచ్‌సీఏపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

29-03-2026 01:22 AM

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్, మార్చి 28 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విశాఖకు ఇచ్చిన రూ.69 కోట్ల రూపాయ లు, జీహెచ్‌ఎంసీ క్లబ్బుల అక్ర మ ప్రైవేటీకణ, 108 మిస్సింగ్ హెచ్‌సీఏ క్లబ్బుల విషయంలో ప్ర భుత్వం మౌనం వీడాలని కోరింది. హెచ్‌సీఏపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవా లని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో ఉన్న మోసపూరిత సభ్యత్వ వ్యవస్థపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీనే సంచలన విషయాలు బయట పెట్టిందని గుర్తు చేశారు.

అక్రమాలకు సం బంధించిన కీలక రికార్డులను మాయం చేసారని ఆరోపించారు. అలాగే హెచ్‌సీఏ ఎన్నిక ల జాబితాలోనూ చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. 2015లోని రిజిస్టర్‌లో 214 క్లబ్బులు ఉన్నట్టు చూపారని, 1992 వరకూ ఏజీఎం రికార్డుల్లో లేని 80 కొత్త క్లబ్బులు అకస్మాత్తుగా చేర్చారన్నా రు. కేవలం నకిలీ ఓటింగ్ బలం సృష్టించేందుకు అక్రమంగా కొన్ని క్లబ్బులను ఎంట్రీ చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ము ఖ్యంగా 10 మంది సభ్యుల చేతుల్లోనే 70 క్లబ్బులు ఉన్నాయని, దీనిపై కమిటీ విచారణ జరుపుతోందని గురువారెడ్డి చెప్పారు.

ఇది లా ఉంటే ఐపీఎల్ టికెట్ల స్కామ్‌పైనా పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. భారీ సంఖ్య కాంప్లిమెంటరీ టికెట్లు, ప్లేయర్ పాసులు మళ్లించి అక్రమంగా విక్రయిస్తున్నారని గురువారెడ్డి ఆరోపించారు. నిజమైన క్రికెట్ అభిమానులు, యువ క్రికెటర్లకు ఇవి అందడం లేదన్నారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైందని చెప్పారు.

విశాఖ ఒప్పందంతో జరిగిన రూ.69 కోట్ల నష్టాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే జీహెచ్‌ఎంసీ క్లబ్బులను ప్రభుత్వ నియంత్రణలోకి తిరిగి తీసుకోవాలన్నారు. 80 అక్రమ క్లబ్బులను గుర్తించి విచారణ జరిపి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. సభ్యత్వ మోసం , ఎన్నికల అక్రమాలపై క్రిమినల్ విచారణ చేపట్టాలని టీసీఏ డిమాండ్ చేసింది.