calender_icon.png 20 November, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది

20-11-2025 12:53:34 AM

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటమట రఘు 

ఏటూరునాగారం నవంబర్ 19(విజయక్రాంతి):గత వరదల కారణంగా ప్రాణ నష్టం,ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసినదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులు సీతక్క కలెక్టర్  ఊరును షిఫ్ట్ చేద్దామనుకుంటే గవర్నమెంట్ కు సంబంధించిన,దొడ్ల గ్రామంలో ఉండడంతో దొడ్ల గ్రామస్తులు అంగీకరించడం లేదు గానుక కొండాయి గ్రామస్తులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇక్కడే నిర్మాణం చేపట్టుకుంటామని తెలియజేసినారు.ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకుళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పినారు.

అదేవిధంగా 50లక్షల రూపాయలతో జంపన్న వాగు పై రోడ్డును నిర్మాణం త్వరలో చేపడతానని అన్నారు. కొండాయి గ్రామానికి గ్రామస్తులకు కష్టకాలంలో ఉన్నప్పుడు మంత్రి సీతక్క ఎనలేని సేవ చేసినారని తెలియజేసినారు.అలాంటిది మీరు కష్టకాలంలో ఉంటే సీతక్క చూసుకుంటా ఉండదని మీకు తప్పకుండా న్యాయం చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్ పాషా, జిల్లా నాయకులు డబ్బకట్ల సత్యనారాయణ,గంపల శివకుమార్, ఉప సర్పంచ్ మహేష్ సర్దార్,ఠాగూర్,తిప్పనాపెల్లి రవీందర్, కమల క్క ,తాటి పార్వతీర్, కౌసల్యా సుదర్శన్,మహేష్,నాగార్జున్, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.