20-11-2025 12:54:25 AM
-ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
-వనస్థలిపురం ఏరియా దవాఖానలో ఆకస్మిక తనిఖీ
ఎల్బీనగర్, నవంబర్ 19 : వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా దవాఖానలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఏరియా దవాఖానలో బుధవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా పర్యటించి, అక్కడి వైద్య సేవలను తనిఖీ చేశారు. దవాఖానలో మందుల కొరత ఉందని రోగులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఏరియా దవాఖానలో ప్రతినిత్యం 1200 మంది ఔట్ పేషెంట్లు, ఈహెచ్‌ఎస్ లబ్దిదారులు 200 మంది, ప్రతి నెల దాదాపు 300 డెలివరీలు చేస్తారన్నారు.
అత్యంత రద్దీగా ఉండే ప్రభు త్వ దవాఖానలో వనస్థలిపురం ఏరియా దవాఖాన ఒకటని తెలిపారు. మూడు నెలల క్రితం సీటీ స్కాన్ యంత్రం మంజూరు చేశానని, సీటీ స్కాన్ వినియోగం కోసం నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిక్ డీఈని ఫోన్ చేసి ఆదేశించారు. పేషెంట్స్ కోసం లిఫ్ట్ కూడా మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. దవాఖాన ఆవరణలో ఫార్మసీ, రక్త నమూ నా సేకరణ కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలిం చారు.
దవాఖానలో మందుల కొరత ఉండడంతో వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్ర మంలో డాక్టర్లు దామోదర్, జయమాల, రాజన్, అనిల్ కుమార్, వినయ్ కుమార్, బీఆర్‌ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్, మాధవరం నర్సింహారావు, ముద్దగోని సతీశ్ గౌడ్, పొగుల రాంబాబు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.