7 April, 2026 | 5:06 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

గుణాత్మక విద్యే ప్రభుత్వ లక్ష్యం

02-12-2024 12:32 AM

పర్యాటక అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి

సూర్యాపేట, డిసెంబర్ 1: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మండలం ఇమాంపేట కేజీబీవీని విద్యాకమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్‌తో కలిసి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా తరగతి గదులు, తాగునీటి వసతులను పరిశీలించారు. భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమేశ్‌రెడ్డి మా ట్లాడుతూ.. మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాల మౌలిక వసతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చదువు పరిష్కారం చూపుతుందని.. దీనిని గ్రహించే ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.

మోడల్ స్కూల్‌ను దత్తత తీసుకుని గతంలో రూ.10 లక్షల విలువ గల పరుపులను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. పలు సంస్థల సహకారంతో కేజీబీవీ ప్రహరీ, ఆటస్థలం, క్రీడా వస్తువులు, గేట్, లైటింగ్ బోర్డులను ఏ ర్పాటు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారి వెంట డీఈవో అశోక్ ఉన్నారు.