calender_icon.png 7 July, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జగదాంబిక గోల్కొండ బోనాలు

07-07-2025 12:00:00 AM

హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): సబ్జిమండి గంగపుత్ర సంఘం, గోల్కొండ ఎల్లమ్మ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ ఆలయ 51వ వార్షిక బోనాల వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి భారీ తొట్టెల, బోనం సమర్పించారు. న్యూ గంగానగర్‌లోని కనకదుర్గ ఆలయం నుంచి భారీ తొట్టెల బయలుదేరి సబ్జిమండిలోని మాతా మహంకాళి ఆలయానికి చేరుకుంది.

అక్కడి నుంచి అమ్మవా రికి బోనం, తొట్టెల భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సం ఘం అధ్యక్షుడు దోర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆనందేసి వేణుబాబు, శ్రీశ్రీశ్రీ జగదాంబిక గోల్కొండ ఎల్లమ్మ బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కట్టా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మంగోడి సురేష్ మంగలి పల్లి బాల నరసింహ,

ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ముషీరా బాద్ ఎమ్మెల్యే ముత్తగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ముత్తగోపాల్ కార్యనిర్వహణాధికారులు, శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ మరియు మాతా మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.