calender_icon.png 7 July, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టింటికి వెళ్లిందని భార్యకు గుండు గీసి, వివస్త్రను చేసి హత్య

07-07-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బోరబండలో అత్యంత దారుణ ఘట న వెలుగుచూసింది. తనకు చెప్పకుం డా పుట్టింటికి వెళ్లివచ్చిందన్న కోపం తో ఓ కసాయి భర్త.. భార్యకు గుండు గీసి, వివస్త్రను చేసి హత్య చేశాడు. బోరబండ సాయిబాబా నగర్‌లో నరసింహులు, అతని భార్య సోనీ (30) మూడేళ్లుగా నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నా డు.

పాత నేరస్థుడైన నరసింహులు ఈ నెల 1న స్థానిక నాగుల ఎల్లమ్మ దేవాలయం లో హుండీని దొంగిలించాడు. ఆ డబ్బుతో మద్యం తాగి ఇంటికి వెళ్లా డు. అదే సమయంలో ఫతేనగర్‌లోని తన తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగివచ్చిన భార్య సోనీపై విరుచుకుపడ్డాడు. తన కు చెప్పకుండా పుట్టింటికి వెళ్తావా అంటూ విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె కు గుండు గీసి, వివస్త్రను చేసి దారుణంగా హత్య చేశాడు.

అనంతరం ఆమె దుస్తులను కాల్చివేశాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నరసింహులుపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు ఉన్నాయి. నాగుల ఎల్ల మ్మ ఆలయంలో హుండీ చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నరసింహులును అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తన భార్యను చంపినట్లు అంగీకరించాడు.

పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా సోనీ మృ తదేహం వివస్త్రగా, గుండుతో కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గంజాయి, మద్యానికి బానిసైన నరసింహులు తరచూ సోనీని వేధించేవాడని, ఎనిమిదేళ్ల వారి వివాహ బంధంలో నిత్యం గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.