అక్రిడిటేషన్ల మంజూరు.. పోరాట ఫలితమే
రాజేంద్రనగర్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చెయ్యకపోవడంతో టి యు డబ్ల్యూ జె( ఐ జే యు) ఆధ్వర్యంలో సమాచార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రభుత్వం స్పందించి నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని..
జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు జర్నలిస్టులందరికీ వర్తించేలా కృషి చేయాలని కోరుతూ టి యు డబ్ల్యూ జె( ఐ జే యు) రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండి సలీం పాషా ఆదివారం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.మండలానికి ఒకే అక్రీడేషన్ కార్డు వల్ల రంగారెడ్డి జీహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ మండలంతో సంభందం లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి కి విజ్ఞప్తి చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి, ఎండీ సలీమ్ పాషా, కార్యదర్శి సత్యనారాయణ.
తెలిపారు ఈ సమస్య పరిష్కారానికి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించరని ఐజేయూ జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు విరహత్ ఆలీ , కార్యదర్శి రాంనారాయణ గారు, రాష్ట్ర కోశాధికారి వెంకట్ రెడ్డి హైదరాబాద్,మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శిగ శంకర్ గౌడ్ ,బాల్ రాజు తదితరులతో కలిసి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో భేటీ అయ్యారు.
గత రెండేళ్లుగా నూతన అక్రీడెషన్ కార్డులు జారిచేయక పోవటంపై, ఇతర సమస్యలపై ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి, సమావేశం నిర్వహించి,అక్రీడెషన్లకు సంభందించి జీ ఓ విడుదల చేశారాని ఇది టీయూడబ్ల్యూజే విజయం అని అన్నారు.నూతన జీవో బాగుందని, అర్హులైన వారికి కార్డులు అందుతాయాన్నారు.
జీవో 252 ను సవరించాలని విజ్ఞప్తి
అక్రిడిటేషన్ ల కోసం నూతనంగా విడుదలైన జీవో 252 లో మండలానికి ఒక్క అక్రిడిటేషన్ నిబంధనతో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు ఆందోళకు గురికావాల్సిన అవసరం లేదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారన్నారు.. నూతన జీవో లో మండలానికి ఒక్క కార్డు నిబంధన వల్ల గ్రేటర్ పరిధిలో అర్బన్ మండలాలో ప్రధాన పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ ద్రుష్టి కి తీసుకెళ్లడం జరిగిందనీ వారు పేర్కొన్నారు






